ETV Bharat / state

పీపీఈ కిట్ లేకుండా వెళ్లడం తప్పు: బండి సంజయ్​ - బండి సంజయ్​ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ పీపీఈ కిట్​ లేకుండా గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్​ బాధితుల వద్దకు వెళ్లడం తప్పని భాజపా రాష్ట్ర బండి సంజయ్​ అన్నారు. ఏడేళ్ల తర్వాత సీఎం బయటకు రావటంతో... ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు. గంటసేపు ఆస్పత్రిలో తిరిగి.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారని చెప్పారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : May 20, 2021, 5:20 PM IST

సీఎం కేసీఆర్‌ గాంధీని సందర్శించడాన్ని స్వాగతిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. గాంధీకి వెళ్లిన సీఎంకు అక్కడి సమస్యలు కనబడలేదా అని ప్రశ్నించారు. టెక్నిషయన్లు లేక వెంటిలేటర్లు సరైన నిర్వహణ లేక సగం పనిచేయడం లేదని చెప్పారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న వైద్యులు, సిబ్బందికి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ల సమస్యలను వినలేదన్నారు. కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు... ఏ సమస్యలను గుర్తించారో చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ పీపీఈ కిట్​ లేకుండా గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్​ బాధితుల వద్దకు వెళ్లడం తప్పని చెప్పారు. దీనిని పరమానంద శిష్యుల్లా.. తెరాస ఎమ్మెల్యేలు పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఒక దొంగల ముఠా.. ఈ కమిటీ ఎన్ని సమస్యలు గుర్తించిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. బార్లు, వైన్స్‌లకు లోడ్‌ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్‌ బంద్‌ చేస్తున్నారు. భాజపా దీక్ష చేస్తామనటంతో రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ముఖ్యమంత్రికి ఉన్న అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక వైపు కరోనా.. మరో వైపు వర్షాలతో అన్నదాతలు అవస్థలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

పీపీఈ కిట్ లేకుండా వెళ్లడం తప్పు: బండి సంజయ్​

ఇదీ చదవండి: సమాచారముంటే డీజీపీకి ట్వీట్​ చేయండి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.