ETV Bharat / state

రైతు కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్​ - బండి సంజయ్​

రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. మృతి చెందిన అన్నదాతల ఆత్మకు శాంతి చేకూరలని కోరుకున్నారు.

bjp state president bandi sanjay demand for compensation to farmers
రైతు కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్​
author img

By

Published : Apr 19, 2020, 4:55 PM IST

అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. పిడుగుపాటుకు గురై మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందని.. ఆ ధాన్యాన్ని ఎంఎస్‌పీ రేటుకే కొనాలన్నారు. వర్షంలో ధాన్యాన్ని కాపాడటానికి వెళ్లిన కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ రైతులు పిడుగుపడి మృతి చెందారని తెలిపారు. మరణించిన రైతులకు కేంద్రం ఇచ్చే సాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సాయం చేసి ఆదుకోవాలని కోరారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.