ETV Bharat / state

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నం: బండి సంజయ్‌ - telangana formation day

Bandi Sanjay: తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు భాజపాతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.

Bandi Sanjay
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
author img

By

Published : Jun 2, 2022, 12:31 PM IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాజపా ఎలాంటి ప్రధాన భూమిక పోషించిందో ప్రజలకు తెలుసని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మధ్యవర్తులు లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మోదీదేనని బండి సంజయ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వంపై 8 ఏళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని తెలిపారు. మేం వచ్చాక పీఎం అవాస్ యోజన కింద లక్షల ఇల్లు నిర్మిస్తామని వెల్లడించారు. రైతుబంధు పేరుతో వ్యవసాయ రాయితీలన్నీ ఎత్తివేశారని ఆరోపించారు. ఫసల్ బీమా పథకాన్ని కేసీఆర్‌ నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో హైవేల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసిందన్నారు. వెంచర్ల పేరుతో ప్రభుత్వం భూములు లాక్కుంటోందని బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యం ఎక్కడకు పోతున్నాయని ప్రశ్నించారు.

భాజపా మద్దతు లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదని ప్రజలు గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబం రాజ్యం ఏలుతోంది. ఆనాడు ఉద్యమం చేసిన ఉద్యమకారులు కనుమరుగైపోయారు. వారంతా భాజపాలో చేరుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెరాస పాలన చేస్తోంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పాలన కోసం భాజపా యుద్ధం ప్రారంభించింది. మాతో అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా’. - బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఒక కుటుంబం, ఒక వ్యక్తి ద్వారా తెలంగాణ రాలేదని ప్రజలు గుర్తిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేసుకుంటున్న వేళ మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ యువకులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. భాజపాలోని ప్రతి కార్యకర్త, అనుబంధ సంస్థలు, కార్యకర్తలు రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు భాజపాని గుర్తించకపోయినా.. పేరు కోసం పార్టీ ఎప్పుడూ పోరాటం చేయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనపై... సుపరిపాలన లఘుచిత్ర మాలిక, కరపత్రం, పాకెట్‌ డైరీని ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారితో పాటు పద్మశ్రీ గ్రహీత చింతకింది మల్లేశంను సన్మానించారు. అవినీతిలేని పాలనతో.. భారతీయులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పండిందన్నారు. మధ్యవర్తిత్వానికి తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

భాజపాతోనే అమర వీరుల ఆకాంక్షలు సాధ్యం: బండి సంజయ్‌

ఇవీ చూడండి:

ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై పెత్తనం: కేసీఆర్

బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపిన ముష్కరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.