ETV Bharat / state

'ఎన్టీఆర్‌, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీఆర్, పీవీలపై చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన సంజయ్... గురువారం ఆ మహనీయుల ఘాట్లకు వెళ్లి నివాళులర్పిస్తానని తెలిపారు.

'ఎన్టీఆర్‌, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'
'ఎన్టీఆర్‌, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'
author img

By

Published : Nov 25, 2020, 10:58 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలను తెరాస వాయిదా వేయాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 4న మేయర్​ పీఠంపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

12% శాతం మైనారిటీ ఓట్ల కోసం 80% ఉన్న హిందువులను తెరాస కించపరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం రూ. 3,500 కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో కుటుంబపాలన అంతం కావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కావాలని సూచించారు.

వరద బాధితులకు రూ. 10వేల సాయం ఆపిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. గ్రేటర్​లో ఎంఐఎం అభ్యర్థిని మేయర్ చేయడానికి తెరాస ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో భాజపాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

"ఎన్టీఆర్‌ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని ఎన్టీఆర్‌ ఘాట్‌ కూల్చుతావా? పీవీ అయోధ్య విషయంలో స్ఫూర్తిదాయకపాత్ర పోషించారని పీవీ ఘాట్‌ కూల్చుతావా? గురువారం ఉదయం ఎన్టీఆర్‌, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ఘాట్ల వద్ద ప్రమాణం చేస్తా" --- ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

ఇదీ చూడండి: హైదరాబాద్​లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.