BJP Star Campaigners List Telangana 2023 : తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారకర్తల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 40 మందికి చోటు కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది. అలాగే యడ్యురప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునిల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేశ్వరిని నియమించింది.
ప్రచారకర్తల జాబితాలో చోటు దక్కిన బీజేపీ జాతీయ నాయకుల పేర్లు :
క్రమ సంఖ్య | నాయకుడు పేరు | హోదా |
1 | నరేంద్ర మోదీ | దేశ ప్రధాన మంత్రి |
2 | అమిత్ షా | కేంద్ర హోం శాఖ మంత్రి |
3 | జేపీ నడ్డా | బీజేపీ జాతీయ అధ్యక్షుడు |
4 | రాజ్‌నాథ్ సింగ్ | కేంద్ర మంత్రి |
5 | నితిన్ గడ్కరీ | కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి |
6 | యడ్యూరప్ప | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి |
7 | యోగీ ఆదిత్యనాధ్ | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి |
8 | పీయూష్ గోయల్ | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి |
9 | నిర్మలా సీతారామన్ | కేంద్ర ఆర్థిక మంత్రి |
10 | స్మృతి ఇరానీ | కేంద్ర మంత్రి |
11 | పురుషోత్తం రూపాల | కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి |
12 | అర్జున్ ముండా | కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి |
13 | భూపేంద్ర యాదవ్ | కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి |
14 | సాధ్వి నిరంజన్ జ్యోతి | కేంద్ర మంత్రి |
15 | మురుగన్ | బీజేపీ తమిళ అధ్యక్షుడు |
16 | ప్రకాశ్ జవదేకర్ | బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ |
17 | తరుణ్ చుగ్ | బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ |
18 | సునీల్ బన్సల్ | బీజేపీ నాయకుడు |
19 | అర్వింద్ మీనన్ | బీజేపీ నాయకుడు |
20 | రవి కిషన్ | ఎంపీ |
21 | పురంధేశ్వరి | ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు |
కరీంనగర్లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్ ర్యాలీతో హల్చల్
Telangana Leaders in Campaigners List 2023 : ఇదిలా ఉండగా కేవలం తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్(Rajasingh), కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ పేర్లను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది.
ప్రచారకర్తల జాబితాలో చోటు దక్కిన రాష్ట్ర నాయకులు పేర్లు
క్రమ సంఖ్య | నాయకుడు |
1 | కిషన్ రెడ్డి |
2 | లక్ష్మణ్ |
3 | బండి సంజయ్ |
4 | డీకే అరుణ |
5 | మురళీధర్ రావు |
6 | పొంగులేటి సుధాకర్ రెడ్డి |
7 | జితేందర్ రెడ్డి |
8 | గరికపాటి మోహన్ రావు |
9 | ఈటల రాజేందర్ |
10 | ధర్మపురి అర్వింద్ |
11 | సోయం బాపూరావు |
12 | రాజాసింగ్ |
13 | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
14 | బూర నర్సయ్య గౌడ్ |
15 | ప్రేమేందర్ రెడ్డి |
16 | దుగ్యాల ప్రదీప్ కుమార్ |
17 | బంగారు శృతి |
18 | కాసం వెంకటేశ్వర్లు యాదవ్ |
19 | కృష్ణ ప్రసాద్ |
20 | విజయ శాంతి |
21 | రఘునందన్ రావు |
Vijayashanthi Campaigners in List : బీజేపీ ప్రకటించిన ప్రచారకర్తల జాబితాలో మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి(Vijayashanthi), దుబ్బాక ఎమ్మెల్యేకు మొదట చోటు దక్కలేదు.. ఈ విషయం గమనించిన అధిష్ఠానం అనంతరం వారు ఇరువురు పేర్లు కూడా జాబితాలో చేర్చింది.
ఎన్నికల సమయంలో బీజేపీలో తలెత్తుతున్న ఛైర్మన్ పదవుల పంచాయతీ
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీసీలంటే చిన్నచూపు బీజేపీ రెండో జాబితాలో వారికే అధిక ప్రాధాన్యం : లక్ష్మణ్