ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ప్రచారంలో దూసుకెళ్తున్న భాజపా - bjp latest news

బల్దియా పోరులో సత్తాచాటమే లక్ష్యంగా ప్రచారంలో భాజపా దూకుడు కొనసాగిస్తోంది. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో కమలనాథులు విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పార్టీ ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ నేతలను రంగంలోకి దించుతూ అభ్యర్థులు, శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి నేడు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

జీహెచ్​ఎంసీ ప్రచారంలో దూసుకెళ్తున్న భాజపా

author img

By

Published : Nov 24, 2020, 6:01 AM IST

Updated : Nov 24, 2020, 6:25 AM IST

తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. బల్దియా ప్రచార బరిలో వేగం పెంచారు. గోల్నాక డివిజన్‌లో ప్రచారం మొదలుపెట్టిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి... కాచిగూడ, అంబర్‌పేట, బాగ్‌ అంబర్‌పేట, నల్లకుంటలో రోడ్‌షో నిర్వహించారు. తార్నాక డివిజన్ లాలాపేటలో అభ్యర్థి బండ జయసుధ రెడ్డికి మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్నారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడంలో తెరాస సర్కార్‌ పూర్తిగా విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారు

బెంగుళూరు ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీసూర్య... శేరిలింగంపల్లి.. సికింద్రాబాద్‌, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. పటాన్‌చెరు డివిజన్‌లో ఆశీష్‌గౌడ్​కు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు రోడ్‌షోలో పాల్గొన్నారు. తెరాస సర్కార్‌ను అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. హయత్‌నగర్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి నవజీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ... ఓట్లు అభ్యర్థించారు. కార్వాన్‌ అభ్యర్థి అశోక్‌, గచ్చిబౌలి అభ్యర్థి గంగాధర్ రెడ్డి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమంటూ.. గాంధీనగర్‌, కూకట్‌పల్లి డివిజన్‌లలో భాజపా అభ్యర్థులు గల్లీగల్లీలో ప్రచారం చేశారు.

ఈ నెల 26న భాజపా మేనిఫెస్టో

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... ఇవాళ హబ్సిగూడ, రామంతాపూర్‌, చిలకానగర్‌, ఉప్పల్‌, గడ్డి అన్నారం, చంపాపేట, చైతన్యపురి, నాగోల్‌ రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉదయం మేడ్చల్‌ జిల్లాల్లో... సాయంత్రం జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య... హిమాయత్​నగర్‌లో కర్ణాటక సంఘంతో సమావేశమై భాజపాకు ఓటేయాలని కోరనున్నారు. ఈ నెల 26న భాజపా మేనిఫెస్టో ప్రకటిస్తామని జీహెచ్​ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ నాయకురాలు, సినీనటి విజయశాంతి నేడు భాజపాలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీలో జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా సమక్షంలో... పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

Last Updated : Nov 24, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.