ETV Bharat / state

BJP Deeksha: 'అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను పంపిస్తాం' - భాజపా దీక్ష

BJP Deeksha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అది సాధ్యం కాదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తోన్న కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ప్రజల విశ్వాసం కోల్పోయినోడే పీకేలను పెట్టుకుంటారని ఎద్ధేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ధ నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షాస్థలి నుంచి ప్రకటించారు.

BJP Deeksha: 'తెలంగాణ బడ్జెట్‌ అంతా దొంగ లెక్కలు.. కాకి మాటలే'

author img

By

Published : Mar 17, 2022, 10:11 PM IST

'తెలంగాణ బడ్జెట్‌ అంతా దొంగ లెక్కలు.. కాకి మాటలే'

BJP Deeksha: బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ నుంచి సెషన్‌ పూర్తయ్యే వరకు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా నల్ల కండువాలతో తమ స్థానాల్లో కూర్చొని నిరసన తెలిపితే ప్రభుత్వం సస్పెండ్‌ చేయడాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకున్న భాజపా.. హైదరాబాద్‌ ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ధ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది. మొదట భాజపా దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉదయం అనుమతి ఇచ్చారు. భాజపా కోరిన సమయాన్ని కుదిస్తూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకే దీక్షకు అనుమతి ఇచ్చారు. భాజపా దీక్షతో ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. బారికేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా..

తెలంగాణ బడ్జెట్‌ అంతా దొంగ లెక్కలు.. కాకి మాటలే ఉన్నాయని మాజీమంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్‌, హరీశ్​ రావుకు సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీకేను పెట్టుకున్నారని విమర్శించారు. బంగాల్‌లో కాలు ఇరగకముందే పట్టి కట్టించిండు.. ఇక్కడ ఏమీ కాకముందే ఆస్పత్రికి తీసుకుపోయాడన్నారు. ఈ పీకేల వల్ల ఏమీ కాదన్నారు. ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ వ్యక్తులు కాదు.. శక్తులని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. బండి సంజయ్‌ కోసం అమిత్‌ షా బుల్డోజర్‌ను బహుమతిగా పంపిస్తున్నారన్నారు. తెలంగాణలోని అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను పంపిస్తామని హెచ్చరించారు.

30 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులే..

"గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను ఏడు రోజులే నిర్వహించారు. మా హక్కులను కేసీఆర్ హరించారు. సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టు ఇచ్చిన తీర్పునూ స్పీకర్ గౌరవించలేదు. భాజపాకు ఇక మిగిలింది ప్రజాక్షేత్రం మాత్రమేనని నిర్ణయించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టాం." ఈటల రాజేందర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

బుల్డోజర్​ వస్తోంది..

"తెలంగాణకు బుల్డోజర్ వస్తోంది. యూపీలో ఆదిత్యనాథ్‌ బుల్డోజర్‌తో అవినీతిపరులను తొక్కించారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లు పంపిస్తాం. బండి సంజయ్ కూడా బుల్డోజర్‌కు ఆర్డర్ ఇచ్చారు. భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులకు భాజపా శ్రేణులు ఏమాత్రం భయపడేది లేదు." -రాజాసింగ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే

ఒకరినొక్కరు పొగుడుకోవటానికే వేదికైంది..

బడ్జెట్‌ సమావేశాలు కాంగ్రెస్‌, తెరాస ఒకరినొక్కరు పొగుడుకోవటానికే వేదికైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌, తెరాసలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయని జోస్యం చెప్పారు. భట్టిని ఎంపీగా వెళ్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అనుమతి తీసుకుని అన్ని కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్యాయంగా సస్పెండ్​ చేశారు..

"అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని అడిగాం. మేము మా స్థానాల్లో నల్ల కండువా వేసుకుని నిల్చున్నాం. అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు భట్టిని కేసీఆర్‌.. కేసీఆర్‌ను భట్టి పొగుడుకున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌, తెరాసలు నాణేనికి బొమ్మా బొరుసులా ఉంటాయి. భట్టి బాగా మాట్లాడుతున్నాడని కేసీఆర్‌ పార్లమెంట్‌కు పంపిస్తారట. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకొని మేము ముగ్గురం అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు చేపడతాం" -రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే

భాజపాను చూస్తే కేసీఆర్​కు వణుకు..

కేసీఆర్‌కు భాజపాను చూస్తే వణుకు పుడుతుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా 4 చోట్ల ఘన విజయం సాధించడంతో నోరు మెదపడం లేదన్నారు. ఫలితాలు రాగానే ఏ ఫ్రంట్‌ లేదని కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిని బయట పెడుతారన్న ఉద్దేశంతోనే భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుణ్యమేనన్న ఆయన.. తెలంగాణ విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి రప్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.