ETV Bharat / state

Bandi sanjay: 299 టీఎంసీల కోసం అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్​ సంతకం చేశారు - బీజేపీ వార్తలు

ప్రభుత్వంపై పోరుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలని.. హుజూరాబాద్ ఉప ఎన్నికను అందుకు తొలి మెట్టుగా మలుచుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేసీఆర్ నిర్లక్ష్య ధోరణితోనే కృష్ణా నీటి వాటాలో అన్యాయం జరిగిందని ప్రజలకు వివరించాలని కసరత్తు చేస్తోంది.

Bandi sanjay
బండి సంజయ్‌
author img

By

Published : Jul 5, 2021, 4:40 AM IST

తెలంగాణలో 2023 నాటికి అధికారం చేజిక్కించుకోవాలని భాజపా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక, కరోనా సంక్షోభంలో ప్రజల ఇబ్బందులు, తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం, ప్రభుత్వ వైఫల్యాలు వంటి అస్త్రాలతో విరుచుకుపడేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం, కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ సహా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. తొలుత హుజూరాబాద్ ఉపఎన్నికపై జరిగిన సమావేశంలో ఈటల గెలుపునకు నిర్విరామంగా కృషి చేయాలని నియోజకవర్గ, మండల ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యవర్గం సమావేశం కాగా... ఇటీవల మరణించిన పార్టీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డికి నివాళులు అర్పించారు. కీలక నేతలంతా రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొనగా ఆయా జిల్లాల నేతలు జూమ్ ద్వారా వర్చువల్​గా పాల్గొన్నారు.

మహా పాదయాత్ర

తెరాస పాలనపై నిప్పులు చెరిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా... ప్రజస్వామిక తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి.. హుజూరాబాద్‌లో ముగిస్తానని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగు రాష్ట్రాల సీఎంలు జల వివాదం రాజేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కోసం అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్​ సంతకం చేశారని... ఆ విషయంపై భాజపా అప్పుడే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.

కాంగ్రెస్​ను తెదేపా నడిపిస్తోంది

హుజూరాబాద్‌లో తెరాసను ఓడించడమే భాజపా లక్ష్యమన్న భాజపా రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్.. కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ను తెరాస నడిపిస్తే... ప్రస్తుతం తెదేపా నడిపించనుందంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్రానికి సాయం చేస్తోందని.. కేసీఆర్ కుటుంబానికి ఇస్తేనే రాష్ట్రానికి పైసలు ఇచ్చినట్టా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా నీటి వినియోగంలో తెరాస సర్కారు అవగాహనారాహిత్యంతో కేంద్రంపై నిందలు వేస్తోందని అన్నారు. హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ముందుకు తీసుకొచ్చి సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు వివరించడం, క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా పోరాటలకు కార్యకర్తలు సిద్ధం కావాలని భాజపా నేతలు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.