ETV Bharat / state

BJP Focus on Lok Sabha elections 2024 : ముచ్చటగా మూడోసారి కమలం వికసించేనా..!

BJP Focus on Lok Sabha elections 2024 : దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కాషాయ దళం లోక్‌సభ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను నిలబెట్టుకుంటూనే బలహీనంగా ఉన్న సీట్లను గుర్తించి పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించి.. మోదీ సర్కార్‌ అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోనూ బలహీనంగా ఉన్న 14 పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన బీజేపీ అధిష్ఠానం అసెంబ్లీ పోరుతో పాటు లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తోంది.

2024 Lok Sabha elections on BJP
2024 Lok Sabha elections on BJP
author img

By

Published : May 12, 2023, 10:27 AM IST

దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు

BJP Focus on Lok Sabha elections 2024 : ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలతో పాటు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం పక్కావ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో 2 పర్యాయాలు అధికారం కైవసం చేసుకున్న కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపట్టాలనే ధృడసంకల్ఫంతో ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించి లోక్‌సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది.

BJP Focus on Telangana Assembly elections : కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోదీ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. మోదీ రాకముందు ఒక లెక్క.. వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ప్రచారం సాగింది. మోదీ రాకతో కాంగ్రెస్‌కు ఉన్న అనుకూల వాతావరణాన్ని కొంత వరకు తమవైపు తిప్పుకోగలిగింది బీజేపీ. కర్ణాటక తరహాలోనే ఈ ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ పక్కా ప్రణాళికలు అమలు చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ఒక్క చోట మాత్రమే ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

BJP Focus on Chhattisgarh Assembly elections : మధ్యప్రదేశ్‌తో పాటు అధికారంలోలేని 4 రాష్ట్రాల్లోనూ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తోంది. కర్ణాటక ఎన్నికలు పూర్తవటంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు పావులు కదుపుతున్న కమలదళం ప్రచారం విషయంలో కర్ణాటకకు మించి దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే గతేడాది నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉన్నందున.. ఈ సారి కూడా ఇదే సంప్రదాయం కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. ఇక్కడ ఈ సారి మళ్లీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మిగతా 3 రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే బీజేపీకి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సునాయసానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న 160 పార్లమెంటు స్థానాలను గుర్తించింది.

BJP focus on Telangana assembly elections 2023 : తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్‌తో పాటు మిగతా 13 పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన బీజేపీ అధిష్ఠానం ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.

దేశవ్యాప్తంగా 160 స్థానాల్లో పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, కేంద్రమంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించింది. వారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరు, రాష్ట్రాలకు అందిస్తున్న సాయంతో పాటు విపక్ష పార్టీల ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే బూత్‌ కమిటీ, శక్తి కేంద్రాలతో సమావేశమవుతూ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఎంపీలు సంబంధిత నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించిన పార్టీ అధినాయకత్వం ఖేలో భారత్‌ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించాలని సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.