ETV Bharat / state

'భారతీయ సంస్కృతిని కాపాడటంలో మహిళలది కీలకపాత్ర'

author img

By

Published : Jan 6, 2021, 6:44 PM IST

సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దోమలగూడ, కవాడిగూడ డివిజన్​లో మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆకట్టుకునే రంగవల్లులతో అతివలు ముగ్గులు వేసి బహుమతులు అందుకున్నారు.

k. laxman, bjp, rangoli competetion
కె. లక్ష్మణ్​, భాజపా, ముగ్గుల పోటీలు, ముషీరాబాద్​

భారతీయ పండుగలలో శాస్త్రీయత ఉంటుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్​ అన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడటంలో, భావితరాలకు అందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దోమలగూడలోని కూచిపూడి పార్కు, కవాడిగూడ డివిజన్​లో ఈ పోటీలు జరిగాయి.

100 మందికి పైగా మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొని ఆకట్టుకునేలా రంగవల్లులతో ముగ్గులు వేశారు. పోటీలో విజేతలుగా నిలిచిన మహిళలకు లక్ష్మణ్​, కార్పొరేటర్​ రచన.. బహుమతులను అందజేశారు. ​

ఇదీ చదవండి: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.