ETV Bharat / state

'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో.. నేడు బీజేపీ నిరుద్యోగ మహాధర్నా

author img

By

Published : Mar 25, 2023, 12:13 AM IST

BJP Nirudyoga Mahadharna in Hyderabad : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు పూనుకుంది. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వేదికగా నేడు 'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో నిరుద్యోగుల పక్షాన మహాధర్నా చేయనుంది. ఈ ధర్నాకు పోలీసులు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. దీంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు మహాధర్నా చేయనున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ఈ మహాధర్నాకు నిరుద్యోగులు పెద్ధ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

BJP
BJP

BJP Nirudyoga Mahadharna in Hyderabad : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న కాషాయదళానికి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఒక అస్త్రంగా దొరికింది. ఇప్పటికే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీఆర్​ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న కాషాయపార్టీకి ఈ అవకాశం అందివచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో పోరాట పంథాలో దూసుకువెళ్లాలని భావిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వదలకుండా వాడుకోవాలని నిర్ణయించింది.

'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో ధర్నా : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ఘటనపై దూకుడుగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో 'నిరుద్యోగ మహాధర్నా'కు సిద్ధమైంది. ఈ రోజు ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వేదికగా 'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు మహాధర్నా చేయనుంది. మహాధర్నా కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోలీసుల అనుమతి కోరింది. మొదట పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు షరతులతో అనుమతి ఇచ్చింది. దాంతో మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ధ కాషాయదళం అన్ని ఏర్పాట్లు చేసింది.

ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలి : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన తప్పిదం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​దేనని, ఆయనను బర్తరఫ్ చేయాలనే డిమాండ్​తో కమలదళం ఈ మహాధర్నా చేయనుంది. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వాలని, సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలనే డిమాండ్లతో నిర్వహించే ఈ మహాధర్నాకు నిరుద్యోగులు పెద్ధ సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.

నిరుద్యోగ మార్చ్​కు సిద్దమవుతున్న కాషాయదళం : మహాధర్నా తరువాత మిలియన్‌ మార్చ్‌ నిర్వహించేందుకు కాషాయదళం సిద్ధమవుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. ఇప్పుడు అదే తరహాలో నిరుద్యోగులందరినీ ఏకంచేసి నిరుద్యోగ మార్చ్​ను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్‌ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాడు 'నీళ్లు-నిధులు-నియామకాల' పేరుతో జరిగిన ఉద్యమం నేడు 'కల్వకుంట్ల లీకేజీ-లిక్కర్-లిఫ్ట్ ఇరిగేషన్' పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఈ ప్రభుత్వంపై పోరాటం మరింత ఉద్ధృతం చేయనున్నట్లు మాజీ శాసనసభ్యుడు, బీజేపీ జాతీయ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.