ETV Bharat / state

వారిద్దరి మధ్య ఉన్న చీకటి బంధం బయటపడింది: ఎంపీ అర్వింద్​

author img

By

Published : Feb 11, 2021, 7:16 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ద్వారా తెరాస, ఎంఐఎం మధ్య ఉన్న చీకటి బంధం బయటపడిందని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఓవైసీ, రజాకార్లకు అమ్ముడుపోయిన సీఎం కేసీఆర్.. హాలియా సభలో గిరిజన మహిళలను అవమానించేలా అహంకారంతో మాట్లాడారని ఆయన విమర్శించారు.

Arvind criticizes Chief Minister KCR
వారిద్దరి మధ్య ఉన్న చీకటి బంధం బయటపడింది: ఎంపీ అర్వింద్​

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో తెరాసకు ఎంఐఎం మద్దతు ఊహించిందేనని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. నల్గొండ జిల్లా హాలియా సభలో దివంగత ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్‌ సంతాపం కూడా తెలపలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం సీఎంకు పరిపాటి అని విమర్శించారు.

రాజన్న రాజ్యం వద్దు.. రామారాజ్యం కావాలి...

గిరిజన మహిళల పట్ల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను గద్దె దించుతారని అన్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నందున వైఎస్‌ షర్మిలకు అర్వింద్‌ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని.. రామరాజ్యం కావాలని చెప్పారు.

ఇదీ చూడండి: 'సాగర్​ ఉపఎన్నికతోనే తెరాస ప్రభుత్వ పతనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.