mp arvind comments on kcr: పారాబాయిల్డ్ రైస్ విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వానాకాలం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్పై అన్ని రాష్ట్రాల మాదిరిగా ధరలు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను కేంద్రం ఆరేళ్లలో 300శాతం పెంచింది. పారాబాయిల్డ్ రైస్ విషయానికొస్తే గత నాలుగేళ్లుగా కేంద్రం చెబుతూనే ఉంది. ఏ రాష్ట్రాల్లో అయితే పారా బాయిల్డ్ తింటున్నారో వాళ్లకు వాళ్లే పండించుకుంటున్నారు.. మీరు తగ్గించుకోండి అని.. అయినప్పటికీ నాలుగేళ్లుగా నిద్రపోయి... రాష్ట్రాన్ని, రైతులను ముంచేశావు. వరి బదులు మక్క వేయమని చెబుతున్నట్లు సమాచారం వస్తోంది. ఇంతకు ముందు మక్క వేయొద్దన్నది ఆయనే. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ జిల్లాలో 417 మంది రైతులు మృతి చెందారు. మీ సిద్దిపేట జిల్లాలో ధాన్యం ఎందుకు కొనడం లేదు...? కేంద్రం 60 లక్షల టన్నుల కొంటుంది. అవసరమైతే పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువ కొంటామా లేదా మాట్లాడదామని చెప్పింది. రైతులను ఎందుకు బాధపెడుతున్నావు.
-ధర్మపురి అర్వింద్, భాజపా ఎంపీ
ఇదీ చూడండి: cm kcr met farmers: వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్... ఆశ్చర్యపోయిన రైతులు.. ఆ తర్వాత..