BJP Mp Aravind: కేంద్రం నుంచి తీసుకున్న బియ్యాన్ని ఏం చేశారో సమాధానం చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన ప్రశ్నించారు. ప్రజలకు పంపిణీ చేయనప్పుడు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు.
రెండు లక్షల టన్నుల బియ్యం ఏం చేశారు. కేంద్రం గరీబోళ్ల పొట్ట నింపాలని పథకం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్యం, ఆవాసం, ఆహారం మూడు అటకెక్కినయి. ప్రస్తుతం అఘాయిత్యం నడుస్తోంది. గ్రూప్-1 పరీక్షలో ఉర్దూను తీసేయాలని కోరుతున్నా. ఆవాస్ యోజన పైసలు తీసుకుంటడు. కానీ ఇల్లు మాత్రం కట్టడు. గరీబోళ్ల పొట్ట ఎందుకు కొడుతున్నవ్. రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏం చేసినవ్. అంత బియ్యం మాత్రం ఎవరు బొక్కరు. స్కూళ్లు వచ్చేవారంలో మొదలవుతుంటే ఇంతవరకు పుస్తకాలకు టెండర్లు వేయలేదు. ఇంకా ఏం చేస్తున్నారు. - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పథకాన్ని ఎందుకు నిలిపివేశారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని అరవింద్ నిలదీశారు. రానున్న కాలంలో రాష్ట్రం నుంచి వడ్ల కొనుగోలు అపుతామని ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి పీఎం అవాస్ యోజన నిధులు తీసుకుంటున్నారని... కానీ ఇళ్లు కట్టడంలేదని మండిపడ్డారు. ఆహారం, ఆవాసం,ఆరోగ్యం తెలంగాణలో ఆటకెక్కాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతానన్న కేసీఆర్ ఇప్పటి వరకు తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు ముద్రణ జరగలేదని ఎంపీ అర్వింద్ విమర్శించారు.
ఇవీ చదవండి: మైనర్ బాలికపై అత్యాచారం.. ఇంట్లో అద్దెకుండే వాడి పనే!