ETV Bharat / state

'అపెక్స్ కౌన్సిల్ భేటీని సద్వినియోగం చేసుకోండి'

కేంద్రంపై విమర్శలు మాని... అపెక్స్ కౌన్సిల్​కు ప్రభుత్వం సన్నద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. జలాల పంపకం విషయంలో మొదటి నుంచి తెరాస తప్పులు చేస్తుందని... నీళ్లన్నీ ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లిపోతున్నా... తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

bjp-mp-bandi-sanjay-allegations-on-telangana-government-on-apex-council-meet
'కేంద్రంపై విమర్శలు మాని.. అపెక్స్ కౌన్సిల్​ను సద్వినియోగం చేసుకోండి'
author img

By

Published : Oct 5, 2020, 8:18 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి జలాల విషయంలో మొదటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. తెరాస అవినీతిపై కేంద్రంతో పాటు.. తాము కూడా డేగ కన్నుతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.

''ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం విభజన నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ నీటిని వాడుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. ఆ సమయంలో కేసీఆర్ ఏమి చేస్తున్నారు? తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను దోచుకుంటున్నారు. 203 జీవో విషయంలో నేను స్పందించి కేంద్రానికి లేఖ రాసేవరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? ఆగస్టు 5వ తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్​ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది?''

-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

'కేంద్రంపై విమర్శలు మాని.. అపెక్స్ కౌన్సిల్​ను సద్వినియోగం చేసుకోండి'

నీళ్లు, నిధులు, నియామకాలకు నిలువెత్తు సాక్ష్యం తెరాస అని సంజయ్ వ్యాఖ్యానించారు. నీళ్లన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లిపోతుందని... నిధులతో ముఖ్యమంత్రి జేబులు నింపుకుంటున్నారని... ఇంట్లో ఉన్న ఓ నిరుద్యోగి రానున్న ఎన్నికల్లో నియామకమవుతారని ఆయన ఆరోపించారు.

కేంద్రంపై విమర్శలు మాని... మంగళవారం జరిగే అపెక్స్ కమిటీ భేటీని కేసీఆర్‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సానుకూలంగా లేని ఏపీ.. అంతర్రాష్ట్ర జలవివాద చట్టమే శరణ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.