తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో మంత్రి హరీశ్ రావు చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేని హరీశ్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా నాయకులు లేరని వ్యాఖ్యానించారు. ఆరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి సాధిస్తే నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిపై మంత్రి వ్యాఖ్యలను రఘునందన్ ఖండించారు.
కేసీఆర్‌కు పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 291రూపాయల పన్ను, ట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తున్న రూ. 26.50 సుంకాన్ని ఎత్తివేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. పె గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్‌కు రైల్వే లైన్ ఎవరిచ్చారో ఆర్థిక మంత్రి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
మీ మాయ మాటలను, మోస పూరిత మాటలను నమ్మి.. ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత సర్పంచ్ సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వరకూ వారికి మీరు నిధులివ్వలేదు. అప్పులు కట్టలేక ఉదయం పూట సర్పంచ్‌గా.. రాత్రి వేళలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న మీరు.. పెట్రోల్‌పై వసూలు చేస్తున్న సుంకాన్ని ఎత్తివేయాలి. వీటన్నిటిపై మీరు సమాధానం చెప్పాలి. -రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపై అమరవీరుల స్తూపం వద్ద హరీశ్ రావుతో చర్చకు సిద్ధమని రఘునందన్ స్పష్టం చేశారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల ప్రశ్నలకు జవాబు చెప్పాలని రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: BC Commission: బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం