ETV Bharat / state

కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్

author img

By

Published : Mar 17, 2021, 2:30 PM IST

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగడం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. నిర్వాసితులకు ఒక్కోచోట ఒకలా ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

bjp-mla-raghunandan-fires-on-trs-government
కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్

కేంద్రప్రభుత్వం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు. ఐటీఐఆర్ సహా ప్రాజెక్టులపై రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని రఘునందరావు ఆరోపించారు. పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు గవర్నర్ ప్రసంగంలో చూపారని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగడం లేదని ఆరోపించారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్కోచోట ఒకలా ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిర్బంధ ఆంక్షలు కొనసాగించడం బాధాకరమని రఘునందనరావు అన్నారు.

ఇదీ చదవండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.