మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని సలీమ్నగర్లో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యే దిశగా కార్యకర్తలు అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికార పార్టీ తెరాస, భాజపా సభ్యత్వ నమోదును కాపీ కొట్టడానికి యత్నించి విఫలమైందని ఆరోపించారు. రానున్న కాలంలో తెలంగాణలో భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : టీచర్ పుట్టినరోజు వేడుక... ఒక్కో విద్యార్థికి ఓ మొక్క