ETV Bharat / state

'మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోండి'

రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని భాజపా మహిళా మోర్ఛా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలని హోంమంత్రి మహామూద్‌ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Feb 12, 2021, 9:31 PM IST

BJP Mahila Morcha leaders hand over petition to Home Minister Mahmood Ali to stop attacks on women
'మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోండి'

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని భాజపా మహిళా మోర్ఛా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలని హైదరాబాద్‌లో‌ హోంమంత్రి మహామూద్‌ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఘట్‌కేసర్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, అమీన్‌పూర్‌, నాగర్‌కర్నూల్ ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో బాధితులకు న్యాయం జరగలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

పోలీస్ వ్యవస్థను పటిష్ఠ పరిచి మహిళలకు భద్రత కల్పించాలని మోర్ఛా నేతలు హోంమంత్రిని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.