ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భాజపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 33 జిల్లాల బస్సు యాత్రను గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు ముగించారు. వీరి యాత్రకు రాంచందర్ రావు మద్దతు పలికారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోగా.. అధికార పార్టీ చేస్తున్న భూ కబ్జాలు, అక్రమాలపై పాత్రికేయులు బయట పెడితే వారిపై అక్రమ కేసులు, దాడులు చేయిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. వీరి ఆగడాలను అరికట్టాలంటే ప్రస్తుత ఎమ్మెల్సీ, రానున్న ఎన్నికల్లో తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: '12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నా'