ETV Bharat / state

రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌

భాజపా నేత రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. విద్వేషపూరిత పోస్టులు పెట్టడంపై ఖాతాను నిషేంధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

BJP leader Rajasinghe's personal account deleted by Facebook
రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను తొలగిచిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌
author img

By

Published : Sep 3, 2020, 12:19 PM IST

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ వ్యక్తిగత ఖాతాను ఫేస్​బుక్​ తొలగించింది. ఫేస్​బుక్​తోపాటు.. ఇన్​స్టాగ్రామ్​లోనూ రాజాసింగ్​ వ్యక్తిగత ఖాతాలను తొలగించారు. విద్వేషపూరిత సంభాషణలను, పోస్టులను పెట్టడంపై ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ రాజాసింగ్​ ఖాతాలను నిషేధించింది.

విద్వేషపూరిత పోస్టులు పెట్టడం.. మా వేదికలో నిషేధం. మీరు మా విధానాలను ఉల్లఘించినందుకు ఖాతాను నిషేంధిస్తున్నాం.. అని ఫేస్​బుక్​ ఓ ఈమెయిల్​ ప్రకటనలో తెలిపింది.

300 మిలియన్లకు పైగా ఫేస్​బుక్​కు వినియోగదారులు ఉన్నారు. అయితే రాజా సింగ్​ పోస్టులు భారతదేశంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని వాల్​స్ట్రీట్​ జర్నల్​ నివేదికలో తేలింది. ఆ నివేదిక నేపథ్యంలో సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేశారనే అంశంపై చర్చిండానికి.. పార్లమెంటరీ ప్యానెల్​ ఫేస్​బుక్​ ప్రతినిధులను బుధవారం పిలిచింది. మంగళవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయంపై ఫేస్​బుక్​ చీఫ్​ మార్క్​ జుకర్​బర్క్​కు లేఖ రాశారు.

ఫేస్‌బుక్‌లో తన వ్యక్తిగత ఖాతాను తొలగించడంపై రాజాసింగ్ స్పందించారు. తన పేరుతో ఫేస్‌బుక్‌లో చాలా ఖాతాలు ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిసిందని అన్నారు. తనకు తెలియకుండా ఫేస్‌బుక్ ఖాతాలు తెరవడం అక్రమమని పేర్కొన్నారు. తన పేరుతో ఉన్న ఖాతాలను తొలగించినందుకు ఫేస్‌బుక్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2018లో తెరిచిన తన అధికారిక ఖాతాను సైతం నిలిపివేశారని చెప్పారు. తన అధికారిక ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని.. ఫేస్​బుక్​ అధికారులకు తెలియజేస్తున్నట్లు వివరించారు.

స్పందించిన రాజాసింగ్​

ఇదీ చూడండి: 2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.