ఇవీ చూడండి:సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు
లోక్సభ బరిలో భాజపా నేత కిషన్ రెడ్డి - లోక్సభ బరిలో భాజపా నేత కిషన్ రెడ్డి
2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భాజపా సీనియర్ నేత కిషన్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ఎన్నికల ముందే ప్రకటించాలని కోరారు.
లోక్సభ బరిలో భాజపా నేత కిషన్ రెడ్డి
రాష్ట్ర భాజపా నేతలు దిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై భాజపా నేత కిషన్ రెడ్డి మెమోరాండం ఇచ్చారు. తెరాసకు ఓటు వేస్తే కల్వకుంట్ల వారికి గులామ్ కావాల్సిందేనని విమర్శించారు. తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడి నుంచి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.
ఇవీ చూడండి:సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు