ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామాన్నే కాకుండా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ రక్షించాలని అన్నారు. స్పీకర్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్, తెరాస రెండూ కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని పునరుద్ఘాటించారు.
'సీఎం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి'
రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ కలిసిపోయాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. సీఎం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు.