ప్రజలు ఆశించిన పరిపాలన ఇదేనా అని కలెక్టర్లను సీఎం ప్రశ్నించినట్లు తమ దృష్టికి వచ్చిందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల లక్ష్యం నెరవేరలేదు... ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని సీఎం కలెక్టర్లలతో అన్నారంటే రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదని కేసీఆర్ గుర్తించడం తమకు సంతోషకరమన్నారు. లక్ష్యం లేని మాటలు చెప్పే ప్రభుత్వం అని తాము మందు నుంచే చెప్తూ వచ్చామని ఆయన తెలిపారు. సీఎం దగ్గర ఉన్న అధికారులు కూడా స్పందించట్లేదని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. రెండు సంవత్సరాల క్రితం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు అమలయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు 60 రోజుల ప్రణాళిక అంటుంన్నారు... గ్రామ సర్పంచ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రణాళిక ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. 2020నాటికి కోటి ఎకరాలకు నీరు ఇస్తామన్నారు..ఇప్పటి వరకు ఒక గుంట భూమికి కూడా నీరు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో భాజపా సభ్యత్వాలు 12లక్షలే: కేటీఆర్