ఫిట్‌మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్ఆర్ఏ 6 శాతం తగ్గించటం దారుణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సమైక్య పాలకులు 25 శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. పీఆర్సీ వేసిన వెంటనే ఐఆర్ ఇవ్వడం సంప్రదాయం... కానీ ఈ ప్రభుత్వం ఐఆర్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వమేనన్నారు.
ఉద్యోగులపై కక్ష తీర్చుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనబడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 63 శాతం ఫిట్‌మెంట్ ఆశిస్తుండగా 7.5 శాతం సిఫారసు చేయడం ఘోర అవమానం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోరాడి సాధించుకున్న తెలంగాణాలో వారిని ఇలా అవమానించడం సిగ్గుచేటన్నారు. ఇంత దిక్కుమాలిన సిఫారసులు చేసే బదులు వాటిని ప్రకటించకుండా ఉన్నా.. ఉద్యోగులకు గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఫిట్‌మెంట్ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు