రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్.. శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచి బకాయిల తెలంగాణాగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతతోనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పారు. కేసీఆర్ చేతిలో సంపన్న రాష్ట్రాన్ని పెడితే.. అప్పుల ఊబిలోకి నెట్టారని ఘాటుగా విమర్శించారు.
ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఊపర్ షేర్వాని లోపల పరేషాని అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం విధానాల వల్లే రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు తగ్గిస్తే పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు.
ఇదీ చూడండి: దిల్లీఫైర్: కన్నీరు పెట్టిస్తున్న కార్మికుడి చివరి కాల్