ETV Bharat / state

తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి - కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్ టుడే

BJP Kishan Reddy reacts on Election Results : తెలంగాణలో వెలువడ్డ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ 14 శాతం ఓటు బ్యాంక్‌తో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం, బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఫామ్​హౌస్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు.

telangana bjp latest news
BJP Kishan Reddy reacts on Election Results
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 4:10 PM IST

Updated : Dec 4, 2023, 5:20 PM IST

BJP Kishan Reddy reacts on Election Results : కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పోరులో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి తమ పార్టీ చరిత్ర సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan reddy) పేర్కొన్నారు. వెంకట రమణారెడ్డి అయిదేళ్ల పోరాటమే ఈ ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. కామారెడ్డి ఫలితం పట్ల జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసిందన్నారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ముందు దోషిగా నిలబడిన కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్‌కు వెళ్లారని పేర్కొన్నారు.

'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'

Telangana BJP Latest News : గత శాసన సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి వంద శాతం ఓటింగ్ పెరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలపై అనేక పోరాటాలు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని అక్కడి ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెట్టారన్నారు. మధ్యప్రదేశ్‌లో తమ అధికారాన్ని కాపాడుకున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల సరళి, ఇక్కడున్న పరిస్థితులను జాతీయ నాయకత్వానికి వివరిస్తానని తెలిపారు.

Adilabad Telangana Election Result 2023 LIVE : అడవుల జిల్లాలో వెరైటీ తీర్పు - హోరాహోరీగా పోటీ పడ్డ కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణ ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకే తమ ఓటు వేస్తారనే సంకేతాన్ని ఇచ్చారన్నారు. నిరాశను దరిచేరనీయకుండా పట్టుదలతో లక్ష్యం కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని, అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరి సహాయం తీసుకుంటామన్నారు.

"కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పోరులో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి తమ పార్టీ చరిత్ర సృష్టించింది. తెలంగాణలో వెలువడ్డ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో 14 శాతం ఓటు బ్యాంక్‌తో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్నాము. తెలంగాణ ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకే తమ ఓటు వేస్తారనే సంకేతాన్ని ఇచ్చారు". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి

కాటిపల్లి రమణారెడ్డి - ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది

Last Updated : Dec 4, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.