మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala rajendar) చేరికకు భాజపా(BJP) అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధిష్ఠానంతో వర్చువల్గా సమావేశమైన బండి సంజయ్ (Bandi Sanjay) ఈటల విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (J.P.Nadda) వివరించారు.
అధిష్ఠానం తేదీని ప్రకటించిన తర్వాత దిల్లీ వెళ్లి కమల తీర్థం పుచ్చుకోనున్నారు ఈటల. రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఉద్యమకారులకు అండగా నిలవాలని అగ్రనేతలు సూచించినట్లు తెలుస్తోంది.