హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని హిమాయత్ నగర్‌లోని పలు బస్తీల్లో భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు పందిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో... 200 మంది పేద కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పులను అందజేశారు. అలాగే ఆహార పొట్లాలను కూడా పంపిణీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు... నియోజకవర్గంలో ప్రతి రోజు మూడు వేల మందికి ఆహార పొట్లాలు, అన్నదానంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోయేవరకు భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచించారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు