ETV Bharat / state

మంత్రి నిరంజన్​రెడ్డిపై ఈసీకి భాజపా ఫిర్యాదు

author img

By

Published : Mar 4, 2021, 10:38 PM IST

ప్రభుత్వ ఉద్యోగులపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు చేసింది. మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

మంత్రి నిరంజన్​రెడ్డిపై ఈసీకి భాజపా ఫిర్యాదు
మంత్రి నిరంజన్​రెడ్డిపై ఈసీకి భాజపా ఫిర్యాదు

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ప్రధానకూడలి వద్ద ప్రచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. తెరాస మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌... మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి కిందికి వస్తాయన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రిని ఎన్నికల ప్రచారం చేయకుండా ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి ​ హామీలు నిలబెట్టుకోలేదు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.