ETV Bharat / state

ప్రశ్నించే గొంతునే గెలిపించండి: భాజపా అభ్యర్థి - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలు

సొంత దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానని హైదర్​ నగర్​ డివిజన్​ భాజపా అభ్యర్థి వెలగ శ్రీనివాస్​ అన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో తనని కార్పొరేటర్​గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ మేరకు డివిజన్​లో ప్రచారం చేపట్టారు.

bjp candidate campaigning in hydernagar
ప్రశ్నించే గొంతుకగా అవకాశమివ్వండి: భాజపా అభ్యర్థి
author img

By

Published : Nov 22, 2020, 2:09 PM IST

జీహెచ్​ఎంసీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తనకి అవకాశమివ్వాలని హైదర్​నగర్​ డివిజన్​ భాజపా అభ్యర్థి వెలగ శ్రీనివాస్​.. ఓటర్లను కోరారు. గ్రేటర్​ ఎన్నికల సందర్భంగా డివిజన్​లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. సొంత దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినట్లు శ్రీనివాస్​ చెప్పారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రీనివాస్​ ప్రచారం చేశారు. హైదరాబాద్​ అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ప్రభుత్వం.. ఆ లెక్కలన్నీ చూపించాలని డిమాండ్​ చేశారు. జీహెచ్​ఎంసీ అవినీతి కూపంలా తయారైందని ఆరోపించారు. ప్రారంభం నుంచి చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రజా దర్బార్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని తెలిపారు.

ప్రశ్నించే గొంతుకగా అవకాశమివ్వండి: భాజపా అభ్యర్థి

డివిజన్​ ప్రక్షాళనకు తనకు అవకాశమివ్వాలని శ్రీనివాస్​ కోరారు. కార్పొరేటర్​గా తనని గెలిపిస్తే హైదర్​నగర్​ డివిజన్​ని ​ఆదర్శ డివిజన్​గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.