ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా భాజపా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేద ప్రజలను దోపిడీ చేసే ఎల్ఆర్ఎస్ ఛార్జీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను బండి సంజయ్ కోరారు.
ఇవీ చూడండి: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేపట్టాలి: చాడ