ETV Bharat / state

Bio Asia Summit 2024 : 2024 బయో ఆసియా సదస్సు తేదీలు ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ఈసారి థీమ్​ ఇదే - Bio Asia Conference 2024 Theme Latest News

Bio Asia Summit 2024 : హైదరాబాద్‌ వేదికగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన తేదీలు, థీమ్​ను కేటీఆర్ ఈరోజు ప్రకటించారు.

Bio Asia 21st edition dates released by KTR
Bio Asia Conference 2024
author img

By

Published : Aug 19, 2023, 9:31 PM IST

Bio Asia Summit 2024 in Hyderabad : డేటా, కృతిమ మేధ ద్వారా అవకాశాలను పునర్నిర్వచించడం అన్న థీమ్ ఆధారంగా.. తదుపరి బయో ఆసియా సదస్సు జరగనుంది. హైదరాబాద్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు.. బయో ఆసియా 21వ ఎడిషన్ జరగనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2024 సదస్సు తేదీలు, థీమ్​ను మంత్రి ఇవాళ విడుదల చేశారు. డేటా, కృతిమ మేధను సమ్మిళితం చేస్తూ లైఫ్ సైన్సెస్, హెల్త్​కేర్ రంగాల్లో అవకాశాలను పునర్నిర్వచించేందుకు ఒక అసాధారణ వేదిక అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Bio Asia 21st Edition Date and Theme : ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల భవిష్యత్​లో.. ఈ సదస్సు కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో డిజిటల్ ఆవిష్కరణల ప్రభావం పెరుగుతున్న తరుణంలో.. లైఫ్​ సైన్సెస్, టెక్నాలజీని అనుసంధానించడం ద్వారా ఆపార సామర్థ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. జీవశాస్త్రంతో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్​తో డేటాసైన్స్ అనుసంధానమయ్యే నగరం హైదరాబాద్ అని కేటీఆర్ వివరించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని లైఫ్ సైన్సెస్ రంగంతో జోడించడంలో.. హైదరాబాద్ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్​కు ఈ సమ్మేళనం.. మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. 2024 బయో ఆసియా సదస్సుకు 50 దేశాలకు పైగా ప్రపంచ నాయకులు.. పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు హాజరవుతారని కేటీఆర్ వివరించారు.

ఈ సదస్సు అర్థవంతమైన చర్చలతో.. బయో ఆసియా వారసత్వాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలోచనలు, భాగస్వామ్యాలను పంచుకోవడం ద్వారా విప్లవాత్మక మార్పులకు ఇది ఎప్పుడూ తోడ్పడుతుందని తెలిపారు. ఈ ఏడాది థీమ్ ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలలో కొత్త శకానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచస్థాయి మేధావుల సమ్మేళనంతో పరివర్తన దిశగా.. కొత్త సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీని ప్రభావం ప్రపంచస్థాయిలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బయో ఆసియా సదస్సు 2024 వెబ్​సైట్​ను కూడా కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు 2023ను హైదరాబాద్​లో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇన్నోవేషన్ .. ఇన్ఫాస్ట్రక్చర్​.. ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ మూడు అంశాలు దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ఎంతో ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు​. ఇందులో భాగంగానే పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పలు అంకుర సంస్థలకు కేటీఆర్ చేతులు మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సదస్సులో వివిధ దేశాల ఔషధ, బయోటెక్నాలజీ రంగ సంస్థలు, పరిశోధకులు, విధానకర్తలు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

లైఫ్‌ సైన్స్‌ రంగంలో అగ్రగామిగా హైదరాబాద్‌ : కేటీఆర్‌

జీవశాస్త్రాల ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేలా.. బయో ఆసియా సదస్సు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.