హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన పయనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో చదువుతున్న అజయ్, రాజేష్ నాయక్‌లు ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకురాగానే... గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా... రాజేశ్ నాయక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు