బోరబండకు చెందిన దంపతులు వారి కుమార్తెతో కలిసి భూత వైద్యుడు ఆజాంను కలిశారు. ఇంట్లో దెయ్యం ఉందని... దాన్ని వదిలిస్తానని చెప్పి అతను వారిని భయపెట్టాడు. బీదర్‌లోని దర్గాకు తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని... లేని పక్షంలో మంచి జరగదంటూ సూచించాడు. ఈ నెల 11న వారి ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. బాధితులు ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: కనకదుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్