Best Restaurants in Hyderabad : దేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ పురాతనమైన నిర్మాణాలేకాదు.. ఎంతో చరిత్ర కలిగిన ఫేమస్ ఫుడ్స్ కూడా లభిస్తాయి. స్వీట్-హాట్ నుంచి.. వెజ్-నాన్‌వెజ్ వరకు.. ఇరానీ ఛాయ్ నుంచి బ్లాక్ కాఫీ వరకూ.. నోరూరిస్తుంటాయి. అయితే.. ఇలాంటి ఐటమ్స్ నగరంలో చాలా ప్రాంతాల్లో లభిస్తాయి. కానీ.. అత్యంత క్వాలిటీతో అందించే లగ్జరీ రెస్టారెంట్లో టేస్ట్ చేస్తే.. ఆ కిక్కే వేరు. అలాంటి టాప్10 రెస్టారెంట్ల లిస్టు ఇక్కడ చూద్దాం.
Almond House(ఆల్మండ్ హౌస్) : మీరు మిఠాయి ప్రియులా? అయితే తప్పనిసరిగా ఆల్మండ్ హౌస్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ నోరూరించే స్వీట్లతోపాటు రుచికరమైన చాట్‌లు కూడా లభిస్తాయి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌తో చేసిన డెజర్ట్‌లు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.
- లొకేషన్ : మల్టిపుల్, హైదరాబాద్
- ఓపెనింగ్ టైమ్ : ఉదయం 8:00 నుంచి రాత్రి 11:00 వరకు (అవుట్‌లెట్‌లలో మారవచ్చు)
- తప్పక తినాల్సినవి : అజ్మేరీ కలాకంద్, పానీ పూరి, డబుల్ బర్ఫీ, ఖోవా కలాం
Tatva Restaurant(తత్వ రెస్టారెంట్) : నగరంలోని బెస్ట్ వెజ్ రెస్టారెంట్‌లలో తత్వ ఒకటి. నార్త్ ఇండియన్, కాంటినెంటల్ నుంచి ఇటాలియన్, చైనీస్ వంటకాలతో.. ఆహార ప్రియులను ఆకట్టుకోవడంలో తత్వ రెస్టారెంట్‌ది ప్రత్యేక స్థానం.
- లొకేషన్ : జూబ్లీహిల్స్
- ఓపెనింగ్ టైమ్ : మధ్యాహ్నం 12:00 నుంచి 3:30 వరకు, రాత్రి 7:00 నుంచి 11:30 వరకు
- తప్పక టేస్ట్ చేయాల్సినవి : బోర్ష్ట్, కమల్కాక్డి కే గలౌటి, త్రీ వే బ్రుస్చెట్టా, నవాబీ పనీర్
Smoky Pitara(స్మోకీ పిటారా) : ఇది హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించబడిన రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మెక్సికన్ సిజ్లర్ వెజ్ బఫేకి ప్రసిద్ధి చెందింది. మెక్సికన్‌తో పాటు కాంటినెంటల్, ఇటాలియన్ నుంచి నార్త్ ఇండియన్, చైనీస్ వరకు వంటకాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది స్వచ్ఛమైన-శాఖాహార రెస్టారెంట్.
- లొకేషన్ : రోడ్ 36, జూబ్లీహిల్స్
- ఓపెనింగ్ సమయం : మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 4:00 వరకు, రాత్రి 7:00 నుంచి ఉదయం 12:00 వరకు
- తప్పక ప్రయత్నించాల్సినవి : మాంచౌ సూప్, ఆలూ 65, మిలోని తార్కారీ, పనీర్ చట్పట్
AB’s Absolute Barbecues (AB’s అబ్సోల్యూట్ బార్బెక్యూస్) : హైదరాబాద్‌లోని అత్యుత్తమ బఫే రెస్టారెంట్లలో ఇది ఒకటి. ఈ రెస్టారెంట్ ఎప్పుడూ మనోహరమైన ‘విష్ గ్రిల్’ని అందిస్తుంది. యూరోపియన్, మెడిటరేనియన్, ఉత్తర భారతీయులకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి.
- లొకేషన్ : జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్ మాల్, సికింద్రాబాద్, మియాపూర్, బంజారాహిల్స్
- ఓపెనింగ్ టైమ్ : మధ్యాహ్నం 12:00 నుంచి 4:30 వరకు, సాయంత్రం 6:30 నుంచి 11:30 వరకు
- తప్పకుండా టేస్ట్ చేయాల్సినవి : మేతి మహి ఫిష్, వెజ్ కొల్హాపురి, ఆంధ్రా ఫిష్ కర్రీ
Over The Moon Brew Company(ఓవర్ ది మూన్ బ్రూ కంపెనీ) : నగరంలోని ఆహార ప్రియులందరికీ ఇది స్వర్గధామం. ఇందులో ఇండోర్, అవుట్‌డోర్ సీటింగ్ ఆప్షన్ ఉంది. ఇందులో ఒక్కసారి తిన్నారంటే ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక్కడ భారతీయ వంటకాలతోపాటు అమెరికన్, కాంటినెంటల్, చైనీస్, మెడిటరేనియన్ లేదా ఇటాలియన్ ఫుడ్స్ లభిస్తాయి.
- లొకేషన్ : క్వైట్ ల్యాండ్స్, గచ్చిబౌలి
- ఓపెనింగ్ సమయం : మధ్యాహ్నం 12:00 నుంచి 12:00 వరకు
- తప్పక తినాల్సినవి : ఖీమా కలేజీ, కోతు పరోట్టా, కాందహరి ముర్గ్, దోసకాయ గజ్‌పాచో
కేఫ్ బహార్(Café Bahar) : హైదరాబాద్ నగరంలో తప్పక సందర్శించాల్సిన మరో రెస్టారెంట్.. కేఫ్ బహార్. నోరూరించే మొఘలాయ్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. మీరు అసలైన హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నాన్‌వెజ్‌తో పాటు వెజ్ వంటకాలు కూడా చాలా ఫేమస్.
- లొకేషన్ : అవంతి నగర్, హైదర్‌గూడ, బషీర్ బాగ్
- ఓపెనింగ్ సమయం : ఉదయం 11:00 am నుంచి 1:00 am వరకు
- తప్పక తినాల్సినవి : హైదరాబాదీ బిర్యానీ, బ్రెయిన్ మసాలా, కల్మీ కబాబ్, జింజర్ మటన్, మటన్ షాహీ కోర్మా, ముర్గ్ ముసల్లం
మండిల్(Mandil) : ఉత్తర భారత భోజనం కోసం వెతుకుతున్న వారికి ఇది సరైన స్థలం. హైదరాబాద్‌లోని బఫే రెస్టారెంట్లలో ఇది మరొకటి. ఈ రెస్టారెంట్ ఉత్తమంగా నిలవడానికి మరో కారణం ఏంటంటే.. తక్కవ ధరకే సూపర్ ఫుడ్ లభించడం.
- లొకేషన్ : రవి కాలనీ, కొండాపూర్
- ఓపెనింగ్ సమయం : మధ్యాహ్నం 12:00 నుంచి 3:30 వరకు, రాత్రి 7:00 నుంచి 11:00 వరకు
- తప్పక ప్రయత్నించాల్సినవి : ఆఫ్-టాబ్ ముర్గ్, లాల్ మాన్స్, సోంధే ఆలూ, పాప్డీ పనీర్, ఖుబానీ కా మీఠా, నిజామి హుండీ
ప్యారడైజ్ బిర్యానీ(Paradise Biryani) : హైదరాబాద్‌కు వచ్చిన వారిలో చాలా మంది ఈ రెస్టారెంట్లో బిర్యానీ టేస్ట్ చేస్తారు. 1953 నుంచి ఆహార ప్రియులను అత్యంత ప్రసిద్ధ స్థానిక వంటకంతో ట్రీట్ చేస్తూ.. ప్యారడైజ్ నగరంలోని అనేక ప్రదేశాలకు విస్తరించింది.
- లొకేషన్ : జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్ మాల్, సికింద్రాబాద్‌తో పాటు మరిన్ని ప్రదేశాలు
- ఓపెనింగ్ టైమ్ : ఉదయం 11:30 నుంచి రాత్రి 11:00 వరకు (అవుట్‌లెట్‌లలో మారవచ్చు)
- తప్పక తినాల్సినవి : బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, కుకీలు, పేస్ట్రీలు, లస్సీ-ఫలూడా
ఫ్లెచాజో(Flechazo) : దీనిని కూడా కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ ఆసియా, ఉత్తర భారతీయ, మధ్యదరా వంటకాలు లభిస్తాయి. ఈ రెస్టారెంట్ ఆతిథ్యం ఖచ్చితంగా ఓసారి స్వీకరించాల్సిందే.
- లొకేషన్ : సన్ టవర్స్, మాదాపూర్
- ఓపెనింగ్ సమయం : ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4:00 వరకు, సాయంత్రం 6:30 నుంచి ఉదయం 12:00 వరకు
- తప్పక ప్రయత్నించాల్సినవి : తందూరి చికెన్, పాన్ ఐస్ క్రీమ్, లాంబ్ మౌసాకా
ధాబా ఎస్టేడ్ 1986 దిల్లీ(Dhaba estd 1986 Delhi) : ఇది కూడా నగరంలోని బెస్ట్ నాన్‌వెజ్ రెస్టారెంట్లలో ఒకటి. అంతేకాదు.. హైదరాబాద్‌లోని ఉత్తమ పంజాబీ రెస్టారెంట్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
- లొకేషన్ : వెస్ట్రన్ పెరల్ బిల్డింగ్, కొండాపూర్
- ఓపెనింగ్ సమయం : మధ్యాహ్నం 12:00 నుంచి రాత్రి 11:30 వరకు
- తప్పక తినాల్సినవి : అమృతసరి ఫిష్, తవా మటన్, పంజాబ్ కుక్కడ్ మసాలా, తందూరి ధాబా రాన్, అమృతసరి చోలే
హోటల్స్, రెస్టారెంట్స్ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్
కోడిని కోయకుండానే 'చికెన్'.. సూపర్ మార్కెట్లలో అమ్మకానికి రెడీ!