సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య పేర్కొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రానున్న వర్షాకాలంలో దోమల వల్ల డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు.
'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి' - సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసం జీహెచ్ఎంసీ నడుం బిగించింది. దీనిలో భాగంగా కాచిగూడలోని ప్రజలకు కార్పొరేటర్ ఎక్కాల చైతన్య అవగాహన కల్పించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి