ETV Bharat / state

Pet Dogs: బాణసంచా పేలుళ్ల సమయంలో పెంపుడు జంతువులతో జాగ్రత్త!

మనందరికీ సరదా పంచే దీపావళి.. టపాసుల శబ్దాలతో మూగ జీవాలను ఇబ్బందుల్లో నెడుతోంది. బాణసంచా కాల్చేటప్పుడు వచ్చే చప్పుళ్లు, వెలుగుల వల్ల పెంపుడు జంతువులు, పక్షులకు కలిగే ఇబ్బందులు అనేకం. దీనిని దృష్టిలో పెట్టుకుని శబ్ధ కాలుష్యాలు తగ్గించాలని కోరుకుంటున్నారు జంతు ప్రేమికులు. భారీ శబ్దాలకు తాళలేవు.. బాధ చెప్పుకోలేవు కాబట్టి వాటిని మనమే అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Pet Dogs
Pet Dogs
author img

By

Published : Nov 4, 2021, 9:15 AM IST

నగరంలో శునకాలు, పిల్లులు, పావురాలు, ఉడతలు, చిలుకలు తదితర పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుతున్నారు. నగరంలో 50 వేలకు పైగా పెంపుడు జంతువులున్నట్లు అంచనా. కుక్కలు, పిల్లులకు సాధారణ స్థాయి చప్పుళ్ల కన్నా తక్కువ శబ్దాలను సైతం గ్రహించే సామర్థ్యం ఉంటుంది. రాత్రుళ్లు వాటి వినికిడి సామర్థ్యం మరింత ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఆ సమయంలో ఏ చిన్న అలికిడి అయినా, ఇట్టే పసిగట్టి స్పందిస్తాయి. దీపావళి టపాసుల పేలుళ్లకు పెంపుడు జంతువులకు కర్ణభేరి సమస్యలు రావడం, కొన్నిసార్లు పగిలిపోవడం వంటివి సంభవిస్తాయంటున్నారు పశువైద్య నిపుణులు. వాటి మెదడులో అసమతుల్యత ఏర్పడి అటూ ఇటూ తచ్చాడటం, కట్టేసుంటే గొలుసును లాగడం, పెద్దగా మొరగడం చేస్తాయి. గర్భస్రావమూ అయ్యే ప్రమాదం ఉంది. పక్షులు పగలంతా సంచరించి, రాత్రుళ్లు గూటికి చేరతాయి. టపాసుల పేలుళ్ల చప్పుళ్లకు వీటికి నిద్రాభంగం అవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శబ్దాలకు భయంతో మంచాలు, సోఫాల కిందకు దూరినప్పుడు కొద్దిసేపు వదిలేయాలి. తక్కువ శబ్దం విన్పించే గదిలో వాటిని ఉంచాలి. తలుపులు, కిటికీలు మూసేయాలి.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఆలయాలు, నగరాలకు 'దీపావళి' వెలుగులు

Diwali Festival: లక్ష్మీదేవి వాళ్లనే వరిస్తుంది.. ఎందుకో తెలుసా?

'ఆదిపురుష్' షూటింగ్​కు బైబై చెప్పిన ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.