రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని.. బడుగుల ఆత్మగౌరవం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
అన్ని కుల సంఘాలు..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని అన్ని కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 9 శాతం ఉన్న అగ్ర కలాల ఓట్లు కావాలా లేక 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ఓట్లు కావాలో తెల్చుకోవాలన్నారు. నాగార్జునసాగర్‌లో జరిగే ఎన్నికల్లో బలహీన వర్గాల సత్తా ఏమిటో రుచి చూపిస్తామన్నారు.
ఈనెల 27న..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ బిడ్డవై ఉండి, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ధైర్యం ఉంటే బీసీలకు తగ్గించిన రిజర్వేషన్ల పెంపు కోసం ప్రధానమంత్రి మోదీని మెప్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల అమలుపై వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు ఈనెల 27న హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో జేఏసీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం గల్లి పోరాటలతో పాటు న్యాయ పోరాటం చేస్తామన్నారు
ఇదీ చదవండి:డిజిటల్ రంగంలో గిరిజనులు పోటీ పడాలి : సత్యవతి రాఠోడ్