ETV Bharat / state

'విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులు భర్తీ చేయాలి'

రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులను భర్తీ చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘం డిమాండ్​ చేసింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది.

bc students round table meeting
'13 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులు భర్తీ చేయాలి'
author img

By

Published : Dec 31, 2020, 3:34 PM IST

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అన్ని విద్యాసంస్థలపై సీబీఐ విచారణ జరిపించాలని... అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేసీఆర్​ మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్​ చేసింది.

రాష్ట్రంలో 'గాడితప్పిన విద్యావ్యవస్థ- ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి' అనే అంశంపై రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​ ఇందుకు వేదికైంది.

రిజర్వేషన్లు పాటించకుండా నియంతగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​ అప్పారావు అరెస్ట్​ చేయాలని కోరారు. తరగతులు చెప్పకున్న, వసతి గృహాలు నిర్వహించకున్నా.. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నీట్ కౌన్సెలింగ్​లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని.. జాతీయ స్థాయిలో ఫీజు రీయింబర్స్​మెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులను సామాజిక న్యాయం పాటిస్తూ భర్తీ చేయాలని రౌండ్​ టేబుల్​ సమావేశంలో డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి: గెట్​అవుట్​ 2020... హమ్మయ్య ఇవాళ్టితో వెళ్లిపోతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.