వీహెచ్‌కు చీపుర్లతో నిరసన బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించడంపై బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వైకాపా ఆహ్వానం మేరకు బీసీ గర్జన మహా సభలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్యపై మాట్లాడే అర్హత వీహెచ్‌కు లేదని నేతలు విమర్శించారు. కృష్ణయ్య అవకాశవాది అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చీపుర్లు ప్రదర్శిస్తూ బీసి సంఘ నాయకులు నిరసన తెలిపారు.