ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: బీసీ సంఘం నాయకులు

రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును కలిశారు. రాష్ట్రంలో కరోనా కేంద్రాలను పెంచాలని, కొవిడ్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వినతి పత్రం అందజేశారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
author img

By

Published : May 4, 2021, 10:55 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను మరిన్ని పెంచి వ్యాక్సిన్ వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ఆరోగ్య శాఖకు విన్నవించారు. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావుకు వినతి పత్రం అందజేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ విన్నవించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో జనం లైన్లలో ఉంటున్నారని తెలిపారు. కరోనా వ్యాధితో పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన చాలా మంది కార్పొరేట్ అసుపత్రులో లక్షల్లో ఫీజు చెల్లించలేక మరణిస్తున్నారని, వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన శ్రీనివాసరావు డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: నేతల పరస్పర విమర్శలు... బయటపడుతున్న తెరాస రహస్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.