గ్రేటర్ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు తెరాసకేనని మాజీ బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ ప్రకటించారు. నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండే వెనుకబడిన కులాలకు ప్రభుత్వం చేసిన మేలు మరువబోమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో వెనుకబడిన కులాల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ కార్యచరణ దశ-దిశపై చర్చించారు.
17 కొత్త కులాల చేరికతో తమ బలం 130 కులాలకు పెరిగిందని... రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెనుకబడిన తరగతులకు ఇచ్చే నిధుల వాటా పెంచుకుంటూ వస్తోందని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తెరాసకే తమ మద్దతు అని నేతలు తీర్మానించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ, ఫీజు మాఫీ తెచ్చింది : జ్యోతి గౌడ్