ETV Bharat / state

రాజ్‌భవన్​లో బతుకమ్మ సంబురం.. ఆడిపాడిన గవర్నర్

author img

By

Published : Oct 2, 2019, 11:40 PM IST

మహిళలందరితో కలిసి రాజ్​భవన్​లో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళలు మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా పేర్చి ఆనందంతో ఆడారు.

రాజ్‌భవన్​లో బతుకమ్మ ఆడిన గవర్నర్
రాజ్‌భవన్​లో బతుకమ్మ ఆడిన గవర్నర్

రాజ్​భవన్​లో యువతులు, మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆడుతూ పాడుతూ మూడోరోజూ బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలను రంగు, రంగుల పూలతో తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాల్లో 200 మందికి పైగా మహిళలు పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో అక్టోబరు 5వ తేదీ వరకూ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్​ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. రాజ్​భవన్​లో జరిగిన దుర్గా దేవి పూజలో గవర్నర్ పాల్గొన్నారు. అనంతరం పలువురికి బతుకమ్మ చీరలను పంపీణీ చేశారు.

ఇదీ చూడండి : ఆహార పదార్థాలు కలుషితమై 25 మందికి అస్వస్థత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.