ETV Bharat / state

ఆన్​లైన్​​ ద్వారా సింగపూర్​లో బతుకమ్మ సంబురాలు - సింగపూర్​లో బతుకమ్మ సంబురాలు 2020

సింగపూర్​లో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఏటా ధూంధాంగా అంబరాన్నంటేలా జరిగే బతుకమ్మ వేడుకలు ఈఏడు కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా ఐదుగురు సభ్యుల సమూహం.. జూమ్​యాప్​ ద్వారా మిగిలిన వారు పాల్గొని పండుగను వైభవంగా నిర్వహించారు. టీసీఎస్​ఎస్​ బృందానికి బతుకమ్మను పేర్చిన ఆడపడుచులకు అభినందనలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం పంపారు.

bathukamma celebrations in singapore
ఆన్​లైన్​​ ద్వారా సింగపూర్​లో బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 24, 2020, 9:43 PM IST

తెలంగాణ సంప్రదాయాన్ని సింగపూర్​లోనూ కొనసాగించడంలో ఎల్లప్పుడు ముందుండే తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్​ఎస్​) ఆధ్వర్యంలో అక్టోబర్ 24న​​ సింగపూర్ బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈఏడు వేడుకల్లో ప్రత్యక్షంగా ఐదుగురు పాల్గొనగా జూమ్ ద్వారా మిగిలిన వారు హాజరై సంబురాలను కన్నుల పండువగా నిర్వహించారు. ఏటా సుమారు రెండు నుంచి మూడు వేల మంది పాల్గొనేవారని.. ఈసారి కొవిడ్​ నిబంధనల కారణంగా దాదాపు 50 చోట్ల ఐదుగురు సమూహంతో ఆన్​లైన్​ ద్వారా నిర్వహించామని టీసీఎస్​ఎస్​ కార్యవర్గం తెలిపింది. అనివార్య కారణాల వల్ల ఆన్​లైన్ సంబురాల్లో పాల్గొనలేకపోయిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపి టీసీఎస్​ఎస్​ను అభినందించారు. సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ బంజారా జానపద కళాకారిణి అశ్విని రాథోడ్ ధూంధాం పాటలతో అలరించి ఆడపడుచులను ఉత్సాహపరిచారు.

సంప్రదాయానికి విదేశంలో పట్టంకట్టిన వారికి కృతజ్ఞతలు...

సుమారు 12 సంవవత్సరాల నుంచి సింగపూర్​లో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు పండుగ ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందనుకు ఎంతో సంతోషంగా ఉందని కవిత వీడియో సందేశంలో తెలిపారు. ఈసారి టీసీఎస్​ఎస్​ నిర్వాహకులు, బతుకమ్మ పేర్చిన ప్రతి ఒక్కరికీ ప్రశంసాబహుమతిని అందజేశారు. ఈసందర్భంగా, సంబురాలకు చేయూత అందిస్తున్న ఉత్సవాలు విజయవంతం అవడానికి సహకరించిన వారందరికి టీసీఎస్​ఎస్ అధ్యక్షులు​ నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.