ETV Bharat / state

'ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తాం'

ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ రీజినల్ హెడ్ కె.వినోద్ కుమార్ తెలిపారు. 'ఆర్థిక అక్షరాస్యత సప్తాహ' పేరిట ఈనెల 10 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

bank of baroda financial literacy seminar in hyderabad
'ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తాం'
author img

By

Published : Feb 11, 2020, 9:08 PM IST

ఫైనాన్సియల్ లిటరసీ వీక్​లో భాగంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ రీజినల్ హెడ్ కె.వినోద్ కుమార్ తెలిపారు. ఆర్బీఐ నియమ నిబంధనలతో పాటు... 'ఆర్థిక అక్షరాస్యత సప్తాహ' పేరిట హైదరాబాద్ నగరంలో 77 శాఖలకు చెందిన ఖాతాదారులకు ఈనెల 10నుంచి 15వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని ఓ హోటల్​లో... సూక్ష్మ , మధ్యతరహా, చిన్న పరిశ్రమలు నిర్వహిస్తున్న వినియోగదారులకు రుణాల వివరాలు, కేంద్ర పథకాల ఉపయోగాలు వివరించారు. రుణాలు తీసుకున్న ఖాతాదారులు సకాలంలో చెల్లించి... తిరిగి రుణాలు పొందాలన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని బ్యాంకు సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.

'ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తాం'

ఇవీ చూడండి: మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.