హైదరాబాద్ బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ముగిసింది. పోచారంలో 1,470 ఫ్లాట్లకు 5,921 దరఖాస్తులు రాగా.. లాటరీ ద్వారా లబ్ధిదారులను హెచ్ఎండీఏ ఎంపిక చేశారు. ఫ్లాట్ దక్కించుకున్న వారి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. జూబ్లిహిల్స్ అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు. అత్యధికంగా బండ్లగూడలోని 'త్రి-బీహెచ్‌కే'డీలక్స్‌లోని ఫ్లాట్‌ల కోసం 16 వేల 679 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ ప్రక్రియను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు.
ఇవాళ పోచారం, రేపు బండ్లగూడ, 29 న బండ్లగూడ 'త్రి-బీహెచ్‌కే' డీలక్స్ డ్రా తీయనున్నారు. ఫ్లాట్ నంబర్‌లు, దరఖాస్తుదారుల పేర్లను వేర్వేరుగా ఎంచుకోవడం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు చేస్తున్నారు. ఒక ఆధార్‌కు.... ఒక ఫ్లాట్‌కు మాత్రమే ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి