Bandi Sanjay Controversial Comments On MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో.. బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీనే అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణ ప్రారంభించారు. అయితే అప్పుడు మహిళా కమిషన్ బండి సంజయ్‌ను మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని రాసిన లేఖ ద్వారా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 18వ తేదీన కమిషన్ ఛైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని ఆ లేఖలో అభ్యర్థించగా కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించింది. దీని ద్వారా 18న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించింది. ఈ నెల 18వ తేదీన శనివారం హాజరుకాలేకపోతే.. మాత్రం తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసు ద్వారా హెచ్చరించింది.
మద్యం కేసులో కవితకు ఈడీ నోటీసులు వారం రోజుల ముందు ఇచ్చింది. ఈ సందర్భంగా బండి సంజయ్ కవితను ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు అదేరోజు చేశారు. తాను ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్‌లలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయి.
పేపర్ లీకేజీపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై బీజేపీ ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్ విఠల్ కన్వీనర్‌గా ఉండగా.. మరో ఎనిమిది మందితో ఈ కమిటిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ టీఎస్‌పీఎస్సీ పేపర్‌లో లీకేజీలో వాస్తవ విషయాల అధ్యయనంతో పాటు తగిన కార్యాచరణపై పని చేస్తుందని బండి సంజయ్ వివరించారు. ఈ టాస్‌ఫోర్స్ కమిటీ సభ్యులుగా...1) మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి 2) బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ 3) చంద్రవదన్, మాజీ ఐఏఎస్ 4) కృష్ణప్రసాద్, మాజీ ఐపీఎస్ 5) ప్రదీప్ కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల 6) ఎస్ కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి 7) కరుణాగోపాల్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ పాలసీ రీసర్చ్ కన్వీనర్ 8) ఎన్. రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: