నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తెరాస సర్కారు గాలికి వదిలేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay on KCR) విమర్శించారు. హైదరాబాద్ చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయాన్ని బండి సంజయ్ సందర్శించారు. గ్రంథాలయానికి చేరుకుంటున్న సమయంలో ఓ నిరుద్యోగి ఆయనను అడ్డుకున్నారు. మీకు లోపలకు రావడానికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదని.. కేంద్రంలో కూడా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్(Bandi Sanjay on KCR) చేశారు. ఈ మేరకు ఆయన నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులను బండి అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అందరూ కలిసి నెలకు రూ. 16 లక్షల జీతం తీసుకుంటున్నారని బండి సంజయ్(Bandi Sanjay on KCR) ఎద్దేవా చేశారు. మరి నిరుద్యోగుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఈ నెల 16న లక్షలాది మంది యువతతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
రూ. 3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ఎన్నికల హామీలో చెప్పారు. ఆ హామీ ఏమైంది.? ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఇప్పుడు కుదరదు అంటున్నారు. ఎప్పుడూ ఇతర రాష్ట్రాలతో తెలంగాణను పోల్చుకునే కేసీఆర్.. చమురుపై ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ఇక్కడ ఎందుకు తగ్గించడం లేదు.? ఇతర రాష్ట్రాలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నాయి. మరి రాష్ట్రంలో ఎప్పుడు వేస్తారు.? చమురు, వంట గ్యాస్ ధరలు పెంచుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం ధరలు తగ్గిస్తే.. మీరెందుకు రాష్ట్రంలో తగ్గించడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలను ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ తగ్గించాలి. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మాట ఇస్తే మడమతిప్పనని చెప్పే కేసీఆర్ ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని అనడంలో అంతర్యం ఏంటని బండి సంజయ్(Bandi Sanjay on KCR) ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ధరలు తగ్గిస్తే రాష్ట్రంలో ఎందుకు తగ్గించడం లేదని బండి సంజయ్ నిలదీశారు.
ఇదీ చదవండి: Sadar Celebrations 2021: బాహుబలి దున్నకు కానుకగా మూడు కిలోల బంగారు గొలుసు