ETV Bharat / state

'విచారణకు బండి సంజయ్​ సహకరించట్లేదు' - బండి సంజయ్​ విచారణ

10th class paper leakage case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజ్​ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని.. వాటిని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ విచారణలో భాగంగా ఏజీ ప్రసాద్​ సంజయ్​ విచారణకు సహకరించట్లేదని పేర్కొన్నారు.

Hearing on Bandi Sanjay petition adjourned
బండి సంజయ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 21కి వాయిదా
author img

By

Published : Apr 10, 2023, 6:21 PM IST

10th class paper leakage case: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఫిటిషన్​పై విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. బండి సంజయ్​ తన ఫోన్​ను పోలీసులకు ఇవ్వడం లేదని... విచారణకు సహకరించట్లేదని ఏజీ ప్రసాద్​ తెలిపారు. సంజయ్ ఇప్పటికే​ బెయిల్​పై విడుదల అయ్యారని.. ఇప్పుడు కేసు దర్యాప్తులో ఆయన ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ఏజీ వాదనలు పరిశీలించిన ధర్మాసనం.. ఈ అంశంపై అఫిడవిట్​ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

పేపర్​ ఎప్పుడు లీకేజ్​ అయింది: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బండి సంజయ్​ని కరీంనగర్​ జిల్లాలో అరెస్ట్ చేసి.. ఆ తర్వాత బెయిల్​పై విడుదల అయ్యారు. ఈ నెల 4న హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్​ ద్వారా బయటకు వచ్చింది. ఈ విషయంలో పోలీసులు ప్రధాన సూత్రధారిగా సంజయ్​ని భావించి ఏ1గా పేర్కొన్నారు. పోలీసులు బండి సంజయ్‌పై నేరపూరిత కుట్ర తదితర కేసులు నమోదు చేశారు.

సంజయ్​ పిటిషన్​ ఎందుకు వేశారు: దీంతో బండిని అరెస్ట్ చేసి ఈ నెల 6న హనుమకొండ న్యాయవాది ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఆయనను రిమాండ్‌పై కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు.ఆ తరువాత సుదీర్ఘ వాదనల అనంతరం హనుమకొండ మెజిస్ట్రేట్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల ఏడో తేదీన ఉదయం ఆయన కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. తనని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్​ చేశారని ఆయన ఆరోపించారు. మెజిస్ట్రేట్ జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను రద్దు చేయాలని.. హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును పదో తేదీకి వాయిదా వేశారు. దీంతో సంజయ్ రిమాండ్ రద్దుపై ఈరోజు హైకోర్టు విచారణ జరిగింది. మరలా ఈ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఫోన్​ పోయిందన్న బండి సంజయ్​: తన మొబైల్​ ఎక్కడో పడిపోయిందని బండి సంజయ్ కరీంనగర్ రెండో పట్టణ​ పోలీసులకు ఈ మెయిల్​ ద్వారా ఫిర్యాదు చేశారు. తన సెల్​ఫోన్​ ఇప్పించాలని పోలీసులను కోరారు. బండి సంజయ్​ని పోలీసులు పేపర్​ లీకేజ్​ కేసులో విచారణ జరిపినప్పుడు తన ఫోన్​ ద్వారానే మెసేజ్​లు వెళ్లాయని సీపీ రంగనాథ్​ ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.